ఫిట్స్‌ వస్తే చేతిలో తాళపు గుత్తి పెట్టాలా, About Fits


ఫిట్స్‌ రావడం ఓ మానసిక రుగ్మతకు, నరాల బలహీనతకు చిహ్నం. ఇలాంటి వారికి చాలా జాగ్రత్తగా ప్రథమ చికిత్స చేయాలి. తాళపు గుత్తి పెట్టితేనో, ఇనుప వస్తువులు చేతుల్లో పెడితేనో ఫిట్స్‌ తగ్గిపోతాయనుకోవడం కేవలం అపోహ మాత్రమే! ఇలా చేయడం వల్ల ఏవిధమైన ప్రయోజనం లేదు. కేవలం కాలయాపన వల్ల రోగికి అందవలసిన చికిత్స మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. ఫిట్స్‌ వల్ల రోగి నోటిలో వచ్చే నురగను వెను వెంటనే తీసెయ్యాలి. అది గొంతు ద్వారా శ్వాసనాళంలోకి వెళ్లకుండా ఉండేందుకు, నాలుక అపస్మారకంగా వెనక్కి మడుచుకుని గొంతులోకి అడ్డుగా పడకుండా ఉండేందుకు, రోగిని బోర్లా పడుకోబెట్టాలి. వూపిరితిత్తుల మీద ఒత్తిడి రాకుండా ఉండేలా ఎడమ భుజం కింద మెత్తటి దిండు అమర్చాలి. ఫిట్స్‌ వచ్చిన వ్యక్తి తాత్కాలికంగా మానసిక విచక్షణ కోల్పోవడం వల్ల విపరీతమైన గందరగోళానికి లోనై పళ్లను గట్టిగా బిగపడతాడు. ఎంతగానంటే చాలాసార్లు పళ్లు కూడా పగిలిపోయి గొంతులోకి వెళ్లవచ్చు. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మెత్తటి గుడ్డ చుట్టిన కర్ర చివరను రెండు దవడల మధ్య ఉంచాలి. ఆహారం, నీరు ఏ మాత్రం ఇవ్వకూడదు. ఆయా పదార్థాలు సరాసరి పొట్టలోకి కాకుండా శ్వాసనాళంలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. తక్షణమే డాక్టరును సంప్రదించి త్వరగా చికిత్స చేయించాలి.

Post a Comment

Previous Post Next Post