+++++ఆపిల్ మెరుపులు...అదరహో!++++++
ఆపిల్ దిగ్గజం సరికొత్తగా ఆలోచిస్తోంది... సాఫ్ట్‌వేర్‌లో సరికొత్త మార్పులతో మురిపించనుంది... ఇక వాడబోయే ఐఫోన్, ఐమ్యాక్, ఆపిల్ వాచ్, ఆపిల్ టీవీ... ఆపిల్ ఉత్పత్తులన్నీ కొత్త హంగులతో అలరిస్తాయి! అవేంటో... వాటి సంగతేంటో చూద్దాం!వాడేది ఎంత హై ఎండ్ గ్యాడ్జెట్ అయినా... సాఫ్ట్‌వేర్ సరిగా లేకుంటే? ప్రయోజనాలు అరకొరే. నేటితరం టెక్ యూజర్లు నిత్యం కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)లు సరికొత్త ఫీచర్లతో మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఐఫోన్‌లో మెసేజ్ పంపడం మరింత మజానిస్తుంది. ‘సిరి’ని మించిన ప్రత్యేకతలతో ‘సిరి ఇంటెలిజెన్స్’ ఫోన్‌లోకి వస్తోంది. ఇంట్లోని మొత్తం ఆపిల్ ఉత్పత్తులను మోనిటర్ చేయడానికి ‘హోమ్’ ఆప్ సిద్ధమైంది. మరోవైపు మ్యాక్‌లో తొలిసారి ‘సిరి’ సందడి చేయబోతోంది. ఇకపై ఆపిల్ టీవీలోనూ ‘ఐక్లౌడ్’ వాడుకోవచ్చు. ఐవాచ్ తన స్పీడుతో వావ్ అనిపించబోతోంది. ఇవే కావు.. ఇలాంటి అదరహో అనిపించే మెరుపులు చాలానే ఉన్నాయి. ఐఓఎస్, మ్యాక్ ఓఎస్, వాచ్ ఓఎస్, టీవీ ఓఎస్... ఇలా అన్నీ కొత్తగా ముస్తాబై వచ్చే నెల్లో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సరికొత్త ఫీచర్ల గురించి ప్రత్యేకంగా అందిస్తున్న కథనమిది. మరి, ఆయా ఓఎస్‌ల ముచ్చట్లని అవే మీతో పంచుకుంటున్నాయి!
అదిరే ఫోన్ ఓఎస్
ఐఫోన్3జీగా మొదలైన నా ప్రయాణం ఇప్పుడు ఐఫోన్ ఎస్‌ఈ వరకు దిగ్విజయంగా నడుస్తోంది. ఇప్పటివరకు తొమ్మిది వెర్షన్‌ల ఓఎస్‌ల సహాయంతో మీకు సేవలందించాను. ఇప్పుడు పదోతరం ఓఎస్ (ఐఓఎస్ 10)తో సరికొత్త విన్యాసాలు చేయబోతున్నాను. అవేంటో తెలుసా?
* ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నప్పుడు వాయిస్ కాల్స్‌ని మాట్లాడలేం. వాయిస్ మెయిల్‌కి వెళ్లేలా చేస్తాం. తర్వాత ఎప్పుడో చూస్తాం. ఇది పాత పద్ధతి. ఆప్పుడు కొత్తగా ‘వాయిస్ మెయిల్ ట్రాన్స్‌క్రిప్సన్’ విధానంతో వాయిస్ మెయిల్‌కు మళ్లించిన కాల్ సారాంశాన్ని టెక్స్ట్‌రూపంలో కన్వర్ట్ చేసి తెరపై చదివి తెలుసుకోవచ్చు. అంతేకాదు ‘స్పామ్ రికగ్నైజర్’ సౌకర్యంతో అక్కర్లేని ఫోన్‌కాల్స్‌ని బ్లాక్ చేయవచ్చు.
* ఫోన్ కాల్స్‌తో పాటు... వాట్సాప్, హైక్, స్కైప్ సర్వీసుల్ని వాడుకుని వీడియో, వాయిస్ కాల్ చేస్తున్నాం. ఒకే నెంబర్‌కి ఇలాంటి ఆప్షన్‌ల ద్వారా సులువుగా కాల్ చేయాలంటే? ‘వీఓఐపీ’ ఆప్షన్‌తో మీకు కావాల్సిన సర్వీసుని సెలెక్ట్ చేసి కాల్ చేయవచ్చు. ఉదాహరణకు కాంటాక్ట్స్‌లో మీకు కావాల్సిన పేరు చూసి దానిపై క్లిక్ చేయగానే సాధారణ కాల్, వాట్సాప్ కాల్, హైక్ కాల్... బటన్‌లుంటాయి. ఇక మీకు నచ్చిన సర్వీసుతో కాల్ చేసుకోవచ్చు.
* కాఫీ తాగొద్దామని క్యాబిన్ దాటుతున్నారు. ఈలోగా ఆఫీసు ల్యాండ్‌లైన్‌కు ఫోన్ వచ్చింది. కంగారుగా వెళ్లి ఫోన్ మాట్లాడాల్సిన పని లేదు. ‘సిస్కో స్పార్క్’ అనే ప్రత్యేక ఆప్‌తో ల్యాండ్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌ను మొబైల్‌కు మళ్లించొచ్చు.
* మెసేజ్‌లో వీడియోను షేర్ చేస్తే లింక్ మాత్రమే కనిపిస్తుంది కదూ! ఇప్పుడు సరికొత్త ‘రిచ్ లింక్’లతో వీడియో లింక్‌తోపాటు థంబ్ నెయిల్ కూడా కనిపిస్తుంది.
* మీ సంభాషణల్లో వాడే ఎమోజీలు కొత్తగా పరిచయం కానున్నాయి. ప్రస్తుత ఎమోజీ పరిమాణం కంటే మూడు రెట్లు పెద్దవిగా ఉండబోతున్నాయి కొత్త ఎమోజీలు.
* గ్రూపులో మీరు పెట్టే మెసేజ్ అందరి దృష్టి ఆకర్షించాలంటే? నా దగ్గర కొత్త ఆప్షన్ ఉంది. మేసేజ్ మొత్తం టైప్ చేశాక... సెండ్ బటన్‌ను ఎక్కువ సేపు ఒత్తి పట్టుకుంటే టైప్ చేసిన మేసేజ్ చిన్న ఫాంట్‌తో పంపించాలా లేక పెద్ద ఫాంట్‌తో పంపాలా లాంటి ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏది ఎంచుకుంటే అలా మీ మెసేజ్ అవతలి వాళ్లకు వెళ్తుంది. ఇలాంటి మార్పులతో తొంరదగా ఆకర్షించొచ్చు కదా.
* మీరెవరికైనా మెసేజ్ పంపితే అవతలి వ్యక్తికి వెంటనే కనిపిస్తుంది. ఇలా కాకుండా పంపిన మెసేజ్ వెంటనే కనిపించకుండా వేలుతో అలా చెరిపితే ఆ మెసేజ్ కనబడాలంటే? బాగుంటుంది కదా. దాన్ని ఈ కొత్త ఓఎస్‌తో తీసుకొస్తున్నా.
* ఎవరికైనా శుభాకాంక్షల మెసేజ్ పంపేటప్పుడు మెసేజ్‌తోపాటు అవతలి ఫోన్ తెర బాణా సంచా వెలుగులతో నిండిపోయేలా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ సౌకర్యమూ కల్పిస్తున్నాం. మెసేజ్‌లతోపాటు మీ ఫీలింగ్ మల్టీమీడియా సొగసులు అద్ది పంపొచ్చు.
* మీరు ఆర్డర్ చేసిన మెనూని, మరో చోట ఉన్న మీ స్నేహితుడు యాక్సెస్ చేస్తే! అతనికి కావాల్సినవి జత చేసి తిరిగి ఆర్డర్ చేస్తే! వెంటనే ఆపిల్ పేతో డబ్బులు చెల్లించేస్తే! ఇందంతా కొత్త ఓఎస్‌లో చిటికెలో సాధ్యం.
* ‘సిరి’లో సమాచారం ఒక్కటే కాదు. వాట్సాప్, వీచాట్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ ఆప్స్‌ను ఓపెన్ చేయమని కోరొచ్చు.
* ఆన్‌లైన్ పేమెంట్స్, ఆన్‌లైన్ యాక్టివిటీ విషయాల్లో ‘సిరి’ మీకు తోడుగా ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు వెతకడం నుంచి అందులోని వస్తువులు కొనుగోలు చేయడం వరకు ‘సిరి’ మీకు ఉపయోగపడుతుంది.
* వేగంగా మెసేజ్ చేయడానికి ‘సిరి’ సరికొత్తగా సాయపడుతుంది. ఒక పదం టైప్ చేశాక... ఆ తర్వాత పదం ఏంటనేది ‘సిరి ఇంటెలిజెన్స్’ ముందుగానే వూహించి కొన్ని సూచన పదాలు ఇస్తుంది. మీరు దాన్నుంచి కావాల్సిన పదాలను ఎంచుకోవడమే!
* స్నేహితుడి పెళ్లి తేదీ, సమాయాన్ని ఫోన్‌లో నోట్ చేస్తే చాలు. ‘సిరి ఇంటెలిజన్స్’ తేదీ, సమయాన్ని గుర్తించి మీ కేలండర్ ఈవెంట్స్‌లో నమోదు చేస్తుంది. ఆ తర్వాత సమాయానికి క్యాలెండర్ ఆప్ ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది. ఒకవేళ అదే రోజు మరో కార్యక్రమానికి హాజరవ్వమని ఎవరైనా మెసేజ్ పంపితే నోటిఫికేషన్ రూపంలో... ‘ఆ రోజు మీరు వేరే కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది.. దీనికి వెళ్లడం కుదరకపోవచ్చు... చెక్ చేసుకోండి’ అనే సమాచారం ఇస్తుంది.
* బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్తుండగా... ‘ఎక్కడున్నారు?’ అని ఇంటి నుంచి మెసేజ్. రిప్లై ఇవ్వలేని పరిస్థితి. ‘సిరి’ మీ స్థితిని గుర్తించి వెంటనే మీరున్న ప్రాంతాన్ని మెసేజ్ రిప్లై రూపంలో పంపించేస్తుంది.
* ఎవరో ఎక్స్ అనే వ్యక్తి నెంబరు పంపమని ఇంట్లో నుంచి మెసేజ్. ఇక మీరు వెతికి పంపక్కర్లేదు. ‘సిరి ఇంటెలిజెన్స్’ చూసుకుంటుంది. ఆ వ్యక్తి నంబరు వెతికి... మెసేజ్ రూపంలో పంపించేస్తుంది.
* ఫొటో గ్యాలరీలో ‘మెమొరీస్’ అనే కొత్త ఫీచర్ చేరింది. మీ ఫోన్‌లోని ఫొటోలను ప్రాంతం, తేదీ, పర్యటన, స్నేహితులు వంటి అంశాల ఆధారంగా ఫోల్డర్లలోకి పంపించేస్తుంది ‘మెమొరీస్’. ఉదాహరణకు స్నేహితులతో గోవా ట్రిప్‌కెళ్లారు. అక్కడ వందల ఫొటోలు తీశారు. తర్వాత ఎవరి ఫొటోలు వారికి పంపిద్దామంటే అన్ని ఫొటోల నుంచి వేరు చేయడం కష్టం. అప్పుడు మొమొరీస్ ఆప్షన్‌ని వాడితే ఒక వ్యక్తి ఫొటోలన్నీ ఒక ఫోల్డర్‌లో వచ్చి చేరతాయి. ఫేస్ రికగ్నైజేషన్‌తో ఇది వీలవుతుంది.
* క్రికెట్ అభిమానులు స్కోరు అప్‌డేట్స్ కోసం స్పోర్ట్స్ ఆప్స్ వాడుతుంటారు. స్కోర్ నోటిఫికేషన్లతోపాటు అక్కడే లైవ్ స్ట్రీమింగ్ కనిపిస్తే! చాలా బాగుంటుంది కదా. దీన్ని కొత్త ఓఎస్‌లో అందిస్తున్నాను.
* ఇంట్లో చాలానే ఆపిల్ ఉత్పత్తుల్ని వాడుతున్నారు. వాటన్నింటినీ ‘హోమ్’ ఆప్‌తో మేనేజ్ చేయవచ్చు. అన్నింటినీ నిత్యం మోనిటర్ చేయొచ్చు. ఉదాహరణకు రాత్రి నిద్రపోయే ముందు ‘గుడ్‌నైట్’ బటన్ ఒత్తితే బెడ్‌లైట్, ఫ్యాన్ మాత్రమే ఆన్ అయ్యి, లైట్లు, టీవీ లాంటివి ఆగిపోతాయి. ఇంట్లో అమర్చిన సెక్యూరిటీ కెమెరానూ దీంతో ఆపరేట్ చేయొచ్చు.
* ఆపిల్ మ్యాప్స్ సరికొత్త హంగులు జోడించుకొంది. మీ దగ్గర్లోని హోటళ్లను వెతకడమే కాదు. వెళ్లాలనుకునే హోటల్‌లో టేబుల్ బుక్ చేసుకోవచ్చు. ఆ వెంటనే... వెళ్లడానికి ఉబెర్ క్యాబ్‌ని బుక్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఆపిల్ మ్యాప్స్‌తో చిటికెలో సాధ్యం.
* విషయం ఏదైనా నోట్స్ రాసి పెట్టుకుంటాం. ఫోన్, ఐప్యాట్, మ్యాక్‌ల్లో రాసిన నోట్స్‌ని సులువుగా అన్నింటిలో సింక్ చేసి చూడాలనుకుంటే? అందుకో ప్రత్యేక ‘నోట్స్ ఆప్’ని అందిస్తున్నా. అంటే ఫోన్‌లో రాసిన నోట్స్‌ని ఇకపై ఐప్యాడ్‌లోనూ చూడొచ్చు.
* ఈ కొత్త ఓఎస్‌ల ప్రైవసీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్సన్ ఆప్షన్ ద్వారా మీ సమాచారం ఎక్కడ కూడా చౌర్యానికి గురి కాకుండా చూస్తున్నాం.
సరికొత్త మ్యాక్ సియోరా
15 ఏళ్లుగా ‘ఓఎస్ ఎక్స్’తో పనిచేస్తున్న నేను త్వరలో అప్‌డేట్ అవుతున్నా. ‘మాక్ ఓఎస్ సియోరా’గా అదనపు సౌకర్యాలతో ముందుకొస్తున్నా. ఇకపై నన్ను ఆన్ చేసిన ప్రతిసారీ పాస్‌వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ చేయనక్కర్లేదు. ఆపిల్ వాచ్ పెట్టుకొని నన్ను తాకితే సరి అన్‌లాక్ అవుతాను. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చూడండి...
* ఇప్పటి వరకూ కాపీ, పేస్ట్ ఆప్షన్లను లెక్కలేనన్ని సార్లు వాడుంటారు. కానీ, ఫోన్‌లో మేటర్ కాపీ చేసి... దాన్ని మీ సిస్టంలో పేస్ట్ చేస్తే! నిజమే... ఇకపై ఐఫోన్‌లో మీరేదైనా టెక్స్ట్ మేటర్‌ని కాపీ చేసి... అవసరం నిమిత్తం అదే మేటర్‌ని సరాసరి మ్యాక్‌లో పేస్ట్ చేసుకునేలా స్మార్ట్ అయ్యా! ‘యూనివర్సల్ క్లిప్ బోర్డ్’ అనే కొత్త ఆప్షన్‌తో ఈ సౌలభ్యాన్ని పరిచయం చేస్తున్నా.
* ఇంట్లో... ఆఫీస్‌లో రెండూ మ్యాక్‌లే. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ సిస్టంలోని డేటాని... ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో మ్యాక్‌లోని డేటాని సులువుగా యాక్సెస్ చేయవచ్చు. అందుకు ‘డబుల్ డెస్క్‌టాప్’ ప్రత్యేకం.* హార్డ్‌డ్రైవ్‌ల్లో భద్రం చేసే డేటాని ఇక మీదట కంప్రెస్ చేసి సేవ్ చేస్తా. ఉదాహరణకు ప్రస్తుత ‘ఓఎస్ ఎక్స్’లో 200 జీబీ ఆక్రమించే ఫైల్స్... సియోరాలో సుమారు 100 జీబీ ఆక్రమిస్తాయి.
* ఒక పక్క మీకు ఇష్టమైన వీడియోని చూస్తూనే... బ్రౌజర్‌లో వెబ్ విహారం చేయవచ్చు తెలుసా? అందుకు ‘పిక్చర్ ఇన్ పిక్చర్’ ఆప్షన్‌తో ఆ వీడియోను పాప్ అప్ విండోలా మార్చుకొని వీడియో చూస్తూనే మీ పని మీరు చేసుకోవచ్చు.
* ఐఫోన్, ఐప్యాడ్‌లో ఇన్నాళ్లు హల్‌చల్ చేస్తున్న ‘సిరి’ని నేనూ తీసుకొస్తున్నాను. ఇకపై మీకు కావాల్సిన సమాచారాన్ని అందివ్వడంలో నాకు ‘సిరి’ తోడుంటుంది.
వహ్వా వాచ్ ఓఎస్
వాచ్... మొబైల్ కలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు రూపం నేను. ఇన్నాళ్లూ ‘వాచ్ ఓఎస్ 2’తో నడిచిన నేను మూడో తరం ఓఎస్ (వాచ్ ఓఎస్ 3)తో వస్తున్నాను. పాత ఓఎస్ కన్నా ఇది ఏడు రెట్లు వేగంగా పని చేస్తుంది. ఇకపై మీరు ఏదైనా ఆప్ ఓపెన్ చేస్తే చటుక్కున ఓపెన్ అయ్యి మీతో శభాష్ అనిపించుకుంటాను. అంతేనా నాలో ఇంకా కొన్ని ప్రత్యేకతలున్నాయి.
* ఐమెసేజ్, మ్యూజిక్, ఫిట్‌నెస్... ఇవీ మీకు తరచుగా అవసరమయ్యే ఆప్స్. వీటి కోసం ప్రతిసారి మెనూలోకి వెళ్లడం, వెతకడం, ఓపెన్ చేయడం ఎందుకు? ఇప్పుడు మీకు నచ్చిన ఆప్స్ అన్నీ ఒకే టచ్‌లో కనిపించే వెసులుబాటు తీసుకొస్తున్నాను. నిత్యం అవసరమయ్యే ఆప్స్‌తో జాబితా రూపొందించుకోవచ్చు. ఆప్షన్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి ఆ జాబితాను ఓపెన్ చేసుకోవచ్చు.!
* తెర బ్రైట్‌నెస్ మార్చుకోవడానికి, తెర బ్రైట్‌నెస్ మార్పు చేసుకోవడం లాంటి వాటికోసం ఫోనులో ‘స్క్రోల్ అప్’ సౌకర్యం ఉంటుంది. అలా ఇప్పుడు నా తెరపై కింది నుంచి పైకి వేలుతో స్వైప్ చేస్తే నోటిఫికేషన్ బార్ ఓపెన్ అవుతుంది. దీంతో మీ పని సులభమవుతుంది. అంతేకాదు... ఒకేసారి రెండు మూడు ఆప్స్‌ను మినిమైజ్ చేసుకోవడం, అవసరమైనప్పుడు వాడుకోవడం కూడా సాధ్యమవుతుంది.!
* మొబైల్‌కు వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్‌ను నాలో చూస్తున్నారు. ఇప్పుడు నా నుంచే రిప్లై ఇచ్చేయొచ్చు. క్వర్టీ కీబోర్డ్‌లో టైప్ చేయడం ఒక్కటే కాదు. స్క్రిబుల్ ప్యాడ్ ఆప్షన్ కూడా తీసుకొస్తున్నా. దీంతో ఎంచక్కా మీకు నచ్చినట్లుగా చేతి రాతతో పదాలు రాసి పంపించొచ్చు.
* నా తెరపై ఎప్పుడూ ఒకే తరహా గడియారం స్క్రీన్ చూసి బోర్ కొట్టకుండా... తెరలకు కొత్త రంగులు అద్దుకొని ముస్తాబయ్యా! ఇప్పుడు వాచ్ తెరపై కుడి, ఎడమకు స్వైప్ చేసి రంగురంగుల వాచ్ స్క్రీన్స్ చూడొచ్చు. వాటిని అప్లై చేస్తే వాచ్ డయల్ కొత్తగా మారిపోతుంది.
* సరికొత్త సౌకర్యాలతో ఫిట్‌నెస్ ఆప్‌ను అందిస్తున్నాం. మీ కసరత్తు వివరాలను నమోదు చేసి... మీ స్నేహితులతో పంచుకోవచ్చు కూడా. అలాగే స్నేహితుల కసరత్తుల వివరాలు చూసి అభినందనలు చెప్పొచ్చు. దివ్యాంగుల కోసమూ ప్రత్యేక ఆప్షన్‌లు సిద్ధం చేశా.
* ఎస్.ఓ.ఎస్. ఆప్షన్ ద్వారా అత్యవసర సమయాల్లో పోలీసులు, స్నేహితులతో సమాచారాన్ని పంచుకోవడానికి నన్ను మీరు వాడుకోవచ్చు. వాచ్‌కున్న ఆప్షన్ బటన్‌ను లాంగ్‌ప్రెస్ చేసి అత్యవసర నంబర్లకు సమాచారం వెళ్లేలా చేయొచ్చు. మీరున్న పరిస్థితి, ప్రాంతం వివరాలు తెలిపేలా స్నేహితునికి ఆటోమేటిక్‌గా మెసేజ్ పంపొచ్చు.
ముచ్చటైన టీవీ ఓఎస్
టీవీ రంగంలో విప్లవంలా వచ్చిన నన్ను బాగానే ఆదరించారు. అందుకే ఇంకా కొత్తగా తయారై మీ ముందుకొస్తున్నా. నా రిమోట్‌ని మరింత స్మార్ట్‌గా మార్చేశా. చిన్న తెర, క్వర్టీ కీప్యాడ్ కలుపుకున్నా. దీంతో మీకు కావాల్సిన వీడియోలు, సినిమాలు వెతకడం సులభమవుతుంది. ఇంకా ఇలాంటివి కొన్ని...
* అంశాల ఆధారంగా సినిమాలను వెతికే సదుపాయం సిద్ధం చేశాను. కామెడీ సినిమాలు చూడాలనుకుంటే ‘కామెడీ’ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే సరి. మొత్తం ఆ విభాగంలోని సినిమాల జాబితా మీ కళ్ల ముందు ఉంటుంది. ఆపిల్ అసిస్టెంట్ ‘సిరి’ ద్వారా పిలిస్తే చాలు. యూట్యూబ్‌లో వీడియోలు, సినిమాలు తెరపై వాలిపోతాయి.
* ‘సింగిల్ సైన్ ఆన్’ ఆప్షన్‌తో ఆపిల్ అకౌంట్‌లోకి ఒక్కసారి ప్రవేశిస్తే చాలు. ఏ ఆప్‌ని వాడాలన్నా, ఇన్‌స్టాల్ చేయాలన్నా మళ్లీ మళ్లీ లాగిన్ వివరాలతో సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు.* ఈ మధ్య అన్నింటినీ క్లౌడ్ సర్వీసుల్లో భద్రం చేస్తున్నారు కదా! ఇకపై మీరు ‘ఐక్లౌడ్’లో భద్రం చేసిన డేటాని టీవీలోనూ యాక్సెస్ చేయవచ్చు. ఉదాహరణకు ఫోన్ నుంచి ఐక్లౌడ్‌లోకి సింక్ చేసిన ఫొటోలు, వీడియోలను సరాసరి టీవీలో చూడొచ్చు.
* మీ ఐఫోన్‌లోనో లేక ఐప్యాడ్‌లోనే ఒక ఆప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. అదే ఆప్‌ను నాలో వాడుకోవడానికి మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోనక్కర్లేదు. ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోగానే టీవీలోనూ డౌన్‌లోడ్ అవుతుంది.
* ఆపిల్ ఆప్ స్టోర్‌ను 8 ఏళ్ల కిత్రం 500 ఆప్స్‌తో ప్రారంభించారు. ప్రస్తుతం ఇందులో 20 లక్షలకుపైగా ఆప్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఆ ఆప్స్‌కి 13 వేల కోట్ల డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. ప్రస్తుతం కోటి ముప్ఫై లక్షల మంది రిజిస్టర్డ్ డెవలపర్స్ ఉన్నారు.
* ఆపిల్ టీవీ 80 వీడియో ఛానల్స్‌తో ప్రారంభమైంది. ఇప్పుడు ఆ ఛానల్స్ సంఖ్య 1300కు చేరింది. టీవీ కోసం ప్రత్యేకంగా 6000 ఆప్స్ ఉన్నాయి.
* ఆపిల్ క్లౌడ్ సర్వీసు ఐక్లౌడ్ డ్రైవ్‌లో సుమారు వెయ్యి కోట్ల డాక్యుమెంట్లు ఉన్నాయి.
* ఆపిల్ న్యూస్‌లో ఇప్పటి వరకు 2000 పబ్లికేషన్స్‌కు సంబంధించిన ఆన్‌లైన్ పత్రికలు ఉన్నాయి. నెలకు 6 కోట్ల మంది ఆపిల్ న్యూస్‌లో వార్తలు చదువుతున్నారు.
* ఆపిల్ మ్యూజిక్‌కు కోటి యాభై లక్షల మంది పెయిడ్ వినియోగదారులు ఉన్నారు.
* ఆపిల్ అసిస్టెంట్ ‘సిరి’లో వారానికి రెండు వందల కోట్ల రిక్వెస్ట్‌లు వస్తున్నాయి.

Post a Comment