బృహత్సంహితలో ఏ నక్షత్రం వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు


బృహత్సంహితలో 
ఏ నక్షత్రం వారికి 
ఎటువంటి లక్షణాలు 
ఉంటాయని చెప్పారు ?
1. అశ్విని : చక్కని రూపం, దక్షత కలిగిన వారు, నీతివంతులు, ప్రియ భాషణులు.
2. భరణి : దృఢనిశ్చయులు, సుఖవంతులు, సత్యవ్రతులు, ఆరోగ్యవంతులు.
3. కృత్తిక : ప్రఖ్యాతులు, తేజస్వులు
4. రోహిణి : సత్యవంతులు, శుభ్రత, ప్రియంవద, స్థిరమతి, సురూప
5. మృగశిర : చపలులు, ఉత్సాహవంతులు, చతురులు, భోగులు, భీకరులు.
6.ఆరుద్ర : గర్వితులు, కృతఘ్నులు అయినవారి ప్రేమించేవారు.
7. పునర్వసు : మంచి స్వభావం కలవారు, అల్పసంతుష్టులు, రోగులు.
8. శాంతస్వభావం కలవారు, పండితులు, ధర్మపరాయణులు.
9. ఆశ్లేష : సర్వభక్షకులు, కృతఘ్నులు, అమాయకులు, సున్నితత్వం కలవారు.
10. మఘ : భోగులు, ధనవంతులు, పితృభక్తులు, మహొద్యమకారులు.
11. పూర్వఫల్గుని : ఎప్పుడూ ప్రియవచనములు పలుకువారు, దాతలు, ద్యుతిమానులు, రాజసేవకులు.
12.ఉత్తరఫల్గుని : భోగులు, సుఖములు కలవారు, విద్యాప్రాప్తి కలవారు.
13. హస్త : ఉత్సాహవంతులు, చోర స్వభావం కలిగివుంటారు.
14. చిత్త : మీన నేత్రులు, గడుసరులు
15. స్వాతి : కృపాళులు, ప్రియవాక్కు కలవారు, ధర్మాశ్రితులు.
16. విశాఖ : ఈర్ష్యబుద్ధి కలవారు, ద్యుతులు, మాన్యవచనులు.
17. అనూరాధ : విదేశీయానం కలవారు, ధర్మాత్ములు.
18. జ్యేష్ఠ : పలువురు మిత్రులు కలవారు, సంతృప్తి కలవారు, కోప స్వభావం కలవారు.
19. మూల : లక్ష్మీపుత్రులు, సుఖపడువారు, స్థిరమనసు కలవారు.
20. పూర్వాషాఢ : సౌహార్ద్ర హృదయం కలవారు, ఇష్టపూర్వకంగా పని చేయువారు, కళలను ఇష్టపడువారు.
21.ఉత్తరాషాఢ : ధార్మికులు, బహుమిత్రులు కలవారు, కృతజ్ఞత కలిగినవారు.
22. శ్రవణం : ఉదారస్వభావం కలవారు, ఖ్యాతి పొందెడువారు, ధనవంతులు.
23. ధనిష్ఠ : దాతలు, ధనలబ్దము కలిగినవారు, సంగీతప్రియులు.
24. శతభిషం : సాహసికులు, కోపస్వభావం కలవారు, వ్యసనపరులు.
25. పూర్వాభాద్ర : సంతోషమును తృప్తిగా అనుభవించలేనివారు, ధనవంతులు, దాతలు.
26. ఉత్తరాభాద్ర : ఎక్కువ సంతానము కలవారు, ధార్మికులు, జితశత్రులు, వక్తలు.
27. రేవతి : శూరులు, శుచివంతులు, సభగులు, సంపూర్ణాంగులు.

Post a Comment

Previous Post Next Post