రక్తపోటును తగ్గించే ‘‘పుచ్చకాయ’’:--
.
.
పుచ్చకాయను సంస్క మీతంలో ‘కాలింద’ అని పిలుస్తారు. వృత్తఫలమని, మధురఫలమనీ అంటారు. హిందీలో ‘తర్బూజ’ అంటారు. ఇంగ్లీషులో వాటర్‌మిలన్‌గాపేరు. ‘‘సిట్రసన్ వల్గేరిన్’’ అని లాటిన్ నామం. పిల్లలు, పెద్దలు వేసంగిలో యిష్టపడి పుచ్చకాయ తింటారు. నదీతీరాల్లో ఇసుక భూముల్లో లంకలలో బాగా పండుతుంది. లతగా పెరుగుతుంది. ఆకులు కోలగా, నొక్కులతో వుంటాయి. ఆకులకు నూగు వుంటుంది. కాయ సాధారణంగా బూడిదరంగులో వుంటుంది. పండితే కొంచం పసుపు రంగుగా మారుతుంది. పైన తెల్లని చార లుండటం దీని ప్రత్యేకత. గింజలు నల్లగా వుంటాయి. పుచ్చకాయలు ఆకుపచ్చగా తెల్లగా కూడా వుంటాయి. పుచ్చ కాయలు ఆకుపచ్చగా తెల్లగా కూడా వుంటాయి. పండితే లోపల ఎర్రగా వుంటుంది. అందుకే ‘చిత్రఫలం’ అనీ పిలుస్తారు. రుచికి చాలా తీయగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. తక్కువ కేలరీలతో, ఎక్కువ పీచుతో, మంచి పోషక విలువలు కలిగి అందర్నీ ఆకర్షిస్తుంది.
అమెరికాలోని ఫ్లారిడా స్టేట్ యూనివర్శిటీ సైంటిస్టులు పుచ్చకాయపై అనేక పరిశోధనలు చేశారు. ప్రి హైపర్ టెన్షన్‌కు దివ్యౌషధం పుచ్చకాయ అని తేల్చారు.
గుండెకు రక్తాని సరఫరాచేసే రక్తనాళాల జబ్బును ముందుగా గుర్తించే గుణం వున్న దానిగా నిరూపించారు. ఫ్లారిడాస్టేట్ యూనివర్శిటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్టురో ఫిగురో మరియు ప్రొఫెసర్ బహ్రాం హెచ్. అర్జ్మండి పుచ్చకాయపై అర్ధవంతమైన పరిశోధనలుచేసి, పుచ్చకాయ నుండి తీసిన అమినో ఆసిడ్- ఎల్ - సిట్రులిన్/ఎల్ ఆర్గినైన్‌ను రోజూ 6 గ్రాముల చొప్పున6వారాలు ప్రిహైపర్ టెన్షన్‌తో బాధపడే రోగులకు యివ్వగా, వారిలో గుణాత్మకంగా మార్పువచ్చి, ఏరోబిక్ బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిపోయినట్లు గుర్తించారు. ఇలా రోగులపై పుచ్చకాయ వైద్యాన్ని చేసి, ఫలితాలను నమోదుచేసిన ఘనత తమదే నంటారు ఆ ప్రొఫెసర్. రక్తనాళాలను పెద్దవి చేసే అద్భుతశక్తి పుచ్చకాయలో వుందని నిరూపించారు. ప్రీహైపర్ టెన్షన్ నెమ్మదిగా, హైపర్ టెన్షన్‌గా మారి, గుండెపోటుకు కారణమై, మరణానికి దారితీస్తుంది. ఇవన్నీ మనకు తెలియ కుండానే పుచ్చకాయను పిచ్చపిచ్చగా తినేస్తున్నాం. రుచి దాహం తీర్చేగుణం చల్లదనం కల్గించటమేకాక, రక్తపోటును నివారించే దివ్యమైన ఔషధ గుణాలు పుచ్చకాయలో వున్నా యన్నమాట. అయితే పుచ్చకాయపై ఇంకా పరిశోధనలు విస్తమీతంగా జరగాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
పుచ్చకాయను ఎందుకు తినాలి? ఎందుకంటే అందులో స్వతఃసిద్ధంగా, తినటానికి వీలైన ‘ఎల్’ సిట్రులిన్ వుంది కనుక. ఇది ‘ఎల్’-ఆర్గినైన్‌తో సంబంధం కలిగి వుంటుంది. ఆరోగ్య వంతమైన రక్తపోటును సంరక్షించటానికి అవసరమైన నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయటానికిది దోహదపడుతుంది. మన శరీరంలో ఎల్-సిట్రులిన్ అనేది ‘ఎల్’ ఆర్గినైన్‌గా మారితే, రక్త పోటు ప్రమాదం వుండదు. వయసువల్ల వచ్చిన హైపర్‌టెన్షన్ రోగులకు ఎల్- ఆర్గినైన్‌ను ఆహారంగాయిస్తే, వాంతి, డయేరియ రావచ్చు, గాస్‌కు సంబంధించిన ఇబ్బందులు కల్గవచ్చు. అందు కని నేరుగా దాన్ని ఇవ్వరు.
పుచ్చకాయలో గొప్పగుణం అందరికి యిష్టమవటం, అన్నిటిని కలిగి వుండటం, అన్నిటిని సహించే లక్షణాలుండటం, ఇది తింటే వ్యతిరేక ఫలితాలు రావు అని పరిశోధనలో తేలింది. దీనిలో ‘ఎల్’ సిట్రులిన్‌తోపాటు, అత్యధికంగా ఎ విటమిన్, బి6, సి విటమిన్లు వున్నాయి. పీచుపదార్ధం సమృద్ధిగా వుంది. పొటాషియం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తి కల్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ను తగ్గించే లక్షణమూ వుంది.
అమెరికాలో ‘‘కార్డియావాస్కులర్ డిసీజ్’’ వల్ల చాలమంది చనిపోతున్నారని పరిశోధనలో తేలిన విషయం. సాధారణంగా అమెరికన్లు కొలెస్టరాల్ గురించి, కొలెస్టరాల్‌ను పెంచే ఆహారాలను గురించే ఆలోచిస్తూ, జాగ్రత్త పడతారుకాని, రక్తనాళాలు సంకోచించి రక్త ప్రసరణకు ఇబ్బంది కలిగించే వాటి గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడైనా యీ ప్రమాదం నుంచి కాపాడే వాటర్‌మిలన్ గురించి బాగా తెలుసుకొని, విస్తారంగా ఆహారంగా పుచ్చకాయ తిని, హృద్రోగాలకు దూరం అవ్వాలని శాస్త్రజ్ఞులు సలహానిస్తున్నారు. ఇది తింటే అంటే హైపర్‌టెన్షన్ మందుల డోసేజినితగ్గించుకొని, బి.పి.ని కంట్రోల్‌చేసుకోవచ్చు.
పుచ్చకాయ, అందులోని సహజసిద్ధమైన ఎల్=సిట్రులిన్ పనితీరు తెలిసిందికదా! ఇప్పుడు ఇది సింధటిక్ పిల్స్ రూపంలో కూడా లభిస్తుంది. దీన్ని యువకులపై ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేశారు. నాల్గువారాలు ఎల్ సిట్రులిన్ వాడితే, చలి కాలంలో పెరిగే ఏరోబిక్ బ్లడ్‌ప్రెషర్ క్రమంగా తగ్గినట్లు గమనించారు. వయసు ముదిరినవారు, టైప్-2 డయాబెటీస్‌తో బాధపడేవారు తప్పక ‘ఎల్’ సిట్రులిన్‌ను సహజంగాకాని, సింథటిక్‌గా కాని వాడితే, బి.పి. బాధనుంచి ఉపశమనం పొందవచ్చు అయితే దీన్ని రోజుకు 4 నుంచి 6 గ్రాములు మాత్రమే వాడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలోని వయోజనులలో సుమారు 60శాతం మంది ప్రిహైపర్ టెన్షన్‌తోనో, హైపర్ టెన్షన్‌తోనో బాధపడుతున్నారు. సిస్టాలిక్ బ్లడ్ ప్రషర్ రీడింగు 120-139 చి.చి.(ఎమ్.ఎమ్.జి) డయాస్టాలిన్ ప్రెషర్ రీడింగ్ 80-89 ఎమ్‌ఎమ్‌జి. దాటితే, ప్రీహైపర్ టెన్షన్‌గా గుర్తిస్తారు. గుండె విశ్రాంతి తీసుకునే దశను, గుండె వ్యాకోచించే దశను ‘డయాస్టాలిక్’ ప్రెషర్ హెచ్చరిస్తుంది.
పుచ్చకాయ తింటే నేత్రదృష్టి పెరుగుతుంది. శరీర ఉష్ణాన్ని తగ్గి స్తుంది. దాహాన్ని తీరుస్తుంది. గృహిణి రోగాన్ని నయం చేస్తుంది. శుక్రవ్యాధి నుంచి విముక్తి కల్గిస్తుంది. కఫాన్ని తగ్గించే లక్షణం వుంది. ఆకలి కల్గించే గుణమూ వుంది. అంటు వ్యాధులు ప్రబలివున్న రోజుల్లో పుచ్చకాయ తినకూడదు. డయేరియా వచ్చి చాలా యిబ్బంది కల్గిస్తుంది.
ఇన్ని మంచి లక్షణాలున్న పుచ్చకాయ, అందరికి యిష్టమైనదేకాక, వైద్యంలో బి.పి.కి విలన్ వాటర్ మిలన్ అని పేరుతెచ్చుకుంది.

Post a Comment