హైబీపీతో, High BP
కనిపించని ఉపద్రవం! ప్రపంచం మొత్తాన్ని చుట్టబెట్టేస్తోంది. కానీ ఆ విషయం ఎవరమూ గుర్తించటం లేదు. అందుకే ఇప్పుడు ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ప్రజలను మేల్కొలిపే బృహత్ కార్యక్రమాన్ని తలకెత్తుకుంటోంది. ఈ ‘ప్రపంచ ఆరోగ్య దినం’ సందర్భంగా... హైబీపీ విషయంలో విస్తృత ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు కారణమవుతున్న రిస్కుల్లో ముఖ్యమైనది హైబీపీ. ఏటా 90 లక్షల మంది దీని దుష్ప్రభావాల కారణంగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హైబీపీతో బాధలుపడుతున్న వారి సంఖ్య దాదాపు 100 కోట్లు! సిస్టాలిక్ సంఖ్య 140 లేదా అంత కంటే ఎక్కువున్నా... లేదా డయాస్టాలిక్ సంఖ్య 90 లేదా అంతకంటే ఎక్కువున్నా... హైబీపీ ఉన్నట్టే!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ‘పోటు’ ఎక్కువగానే ఉంటోంది. కానీ ఆ విషయం వాళ్లలో చాలా మందికి తెలియటం లేదు. రక్తపోటు చాలా ఎక్కువున్నా కూడా పైకి ఎటువంటి లక్షణాలూ కనబడాల్సిన పని లేదు. దీంతో చాలామంది ఆ విషయం తెలియకుండానే తిరుగుతున్నారు... కానీ ఎప్పుడో ఒకసారి హఠాత్తుగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీల వైఫల్యం వంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాల బారినపడి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలా ఏటా దాదాపు 90 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పైగా వీళ్లలో సగానికి సగం మంది గుండెపోటు, పక్షవాతం బారినపడే మరణిస్తున్నారు. హైబీపీ ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటే కేవలం గుండెపోటు ముప్పే కాదు, గుండె లయ తప్పటం, గుండె వైఫల్యం వంటి సమస్యలూ చుట్టుముట్టచ్చు. ఇవే కాదు... హైబీపీ వల్ల కిడ్నీలు విఫలమైపోవటం, చూపు మందగించిపోవటం వంటి సమస్యలూ చుట్టుముడతాయి. ఇక ఈ హైబీపీకి మధుమేహం వంటి రిస్కులూ తోడైతే ఈ దుష్ప్రభావాల తీవ్రత మరింతగా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమకు హైబీపీ ఉందా? అసలు బీపీ ఏ స్థాయిలో ఉంటోందన్నది తరచుగా పరీక్ష చేయించుకుని చూసుకుంటూ ఉండాలి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ‘పోటు’ ఎక్కువగానే ఉంటోంది. కానీ ఆ విషయం వాళ్లలో చాలా మందికి తెలియటం లేదు. రక్తపోటు చాలా ఎక్కువున్నా కూడా పైకి ఎటువంటి లక్షణాలూ కనబడాల్సిన పని లేదు. దీంతో చాలామంది ఆ విషయం తెలియకుండానే తిరుగుతున్నారు... కానీ ఎప్పుడో ఒకసారి హఠాత్తుగా గుండెపోటు, పక్షవాతం, కిడ్నీల వైఫల్యం వంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాల బారినపడి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలా ఏటా దాదాపు 90 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పైగా వీళ్లలో సగానికి సగం మంది గుండెపోటు, పక్షవాతం బారినపడే మరణిస్తున్నారు. హైబీపీ ఉన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటే కేవలం గుండెపోటు ముప్పే కాదు, గుండె లయ తప్పటం, గుండె వైఫల్యం వంటి సమస్యలూ చుట్టుముట్టచ్చు. ఇవే కాదు... హైబీపీ వల్ల కిడ్నీలు విఫలమైపోవటం, చూపు మందగించిపోవటం వంటి సమస్యలూ చుట్టుముడతాయి. ఇక ఈ హైబీపీకి మధుమేహం వంటి రిస్కులూ తోడైతే ఈ దుష్ప్రభావాల తీవ్రత మరింతగా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమకు హైబీపీ ఉందా? అసలు బీపీ ఏ స్థాయిలో ఉంటోందన్నది తరచుగా పరీక్ష చేయించుకుని చూసుకుంటూ ఉండాలి.
ముఖ్యాంశాలు ..
* వయసు పెరుగుతున్న కొద్దీ హైబీపీ ముప్పూ పెరుగుతోంది. 20లలో, 30లలో ఉన్న వారిలో ప్రతి 10 మందిలో ఒకరికి హైబీపీ ఉంటుంటే 50లలోకి వచ్చేసరికి అదే ప్రతి 10 మందిలో ఐదురుగురికి హైబీపీ ఉంటోంది.
* చాలామంది హైబీపీ లాంటివన్నీ సంపన్న దేశాల సమస్యలనుకుంటారుగానీ నిజానికి పేదలు ఎక్కువగా ఉండే దేశాల్లో హైబీపీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో 40% పైగా జనాభా దీని బారినపడటమే ఇందుకు తార్కాణం.
* ప్రపంచీకరణ, పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ చాలా దేశాల్లో హైబీపీ సమస్య కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రజల జీవనశైలి అనారోగ్యకరంగా మారిపోతుండటమే దీనికి ముఖ్యకారణం.
* హైబీపీ అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణమైన సమస్యగా పరిణమిస్తోందిగానీ చాలామంది తమకు హైబీపీ ఉన్న విషయాన్నే గుర్తించటం లేదు. తీరా ఎప్పుడో గుర్తించే నాటికే వారిలో తీవ్రస్థాయి దుష్ప్రభావాలు మొదలైపోయి ఉంటున్నాయి. అలాగే తమకు హైబీపీ ఉందని తెలిసినా చాలామంది సరైన చికిత్స తీసుకోవటం లేదు.
నివారణ, నియంత్రణ
హైబీపీ రాకుండా నివారించుకోవటానికి ఏం చెయ్యాలి? వస్తే దాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి ఏం చెయ్యాలన్నది కీలకం. ఈ రెంటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటే.
*నిత్యం ఉప్పు తగ్గించి తినాలి.
*పండ్లు, కూరగాయలు దండిగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.
* మద్యం మానెయ్యటం మంచిది, లేదంటే చాలా పరిమితంగా తీసుకోవాలి.
* నిత్యం అరగంట వ్యాయామం అవసరం.
* బరువు తగినంతే ఉండేలా, పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* పొగతాగటం పూర్తిగా మానెయ్యాలి.
* మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవాలి.
* ముఖ్యంగా- అంతా తరచూ బీపీ చూపించుకుంటూ ఉండాలి.
*పండ్లు, కూరగాయలు దండిగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.
* మద్యం మానెయ్యటం మంచిది, లేదంటే చాలా పరిమితంగా తీసుకోవాలి.
* నిత్యం అరగంట వ్యాయామం అవసరం.
* బరువు తగినంతే ఉండేలా, పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* పొగతాగటం పూర్తిగా మానెయ్యాలి.
* మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవాలి.
* ముఖ్యంగా- అంతా తరచూ బీపీ చూపించుకుంటూ ఉండాలి.
ఉప్పు.. ఎంతుంటే ఒప్పు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం పెద్దలు రోజుకు 2000 మిల్లీగ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. అంటే రోజు మొత్తమ్మీద మనం తీసుకునే ఉప్పు 5 గ్రాములు మించకూడదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం పెద్దలు రోజుకు 2000 మిల్లీగ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. అంటే రోజు మొత్తమ్మీద మనం తీసుకునే ఉప్పు 5 గ్రాములు మించకూడదు.
* సోడియం అనేది చాలా ఆహార పదార్థాల్లో సహజంగానే ఉంటుంది. మనం తాగే పాలు, తినే గుడ్లు, వెన్న వంటివాటిలో కూడా ఉంటుంది. మనం నిల్వ పెట్టుకుని ఇష్టంగా తినే వడియాలు, వూరగాయల్లోనూ, బయట ప్యాకెట్లలో అమ్మే తినుబండారాల్లోనూ, పాప్‌కార్న్ నుంచి సాస్‌ల వరకూ తినటానికి సిద్ధంగా అమ్మే పదార్థాలన్నింటా ఉప్పు ఎక్కువే ఉంటుంది. ఒరుగులు, వూరగాయల వంటివి పూర్తిగా మానెయ్యలేకపోయినా.. అప్పుడప్పుడు మితంగా తింటూ, రోజూ తినకుండా తగ్గించుకోవటం మంచిది.
పొటాషియం కథ ..
ఉప్పు ఎక్కువగా తినటం ఒక్కటే కాదు... ఒంట్లో పొటాషియం స్థాయులు తగ్గినా కూడా హైబీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మన రోజువారీ ఆహారంలో కనీసం 3,510 మిల్లీగ్రాముల పొటాషియం ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది. ఇది బీన్స్, బఠాణీలు, చిక్కుళ్లు, పాలకూర, క్యాబేజీ వంటి కూరగాయల్లోనూ; అరటిపండ్లు, బొప్పాయి, ఖర్జూరాల వంటి పండ్లలోనూ సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో వీటిలో కొన్నయినా ఉండేలా చూసుకోవటం మంచిది.
* ప్రస్తుతం సమస్య ఏమంటే చాలామంది సోడియం అవసరమైన దానికంటే చాలా ఎక్కువ తినేస్తున్నారు, పొటాషియం మాత్రం అవసరమైన దానికంటే తక్కువే తీసుకుంటున్నారు. అంతా దీన్ని చక్కదిద్దుకోవటం మంచిది.
ఏ జబ్బుతో వచ్చినా బీపీ చూడాలి!
* 25, 30 ఏళ్లు దాటినవారు ఏ జబ్బుతో వైద్యుల వద్దకు వచ్చినా.. వైద్యులు వారికి తప్పనిసరిగా బీపీ చూడటం అవసరం. ‘నా దగ్గరకు వచ్చింది బీపీ కోసం కాదు కదా!’ అని చూడకుండా వదిలెయ్యటం సరికాదు. ఏ కారణంతో వచ్చినా తప్పనిసరిగా బీపీ చూస్తేనే మనం ‘హైబీపీ’ని ముందుగానే పట్టుకోగలుగుతాం.
* రోగి రాగానే, ఇంకా ఆ ఆత్రుతలో ఉన్నప్పుడే బీపీ చూడకూడదు. కొంచెం ప్రశాంతంగా ఉన్న తర్వాత, 2-3 నిమిషాలు అవకాశం ఇచ్చి అప్పుడు చూడటం మంచిది. అలాగే అంతకు ముందే ముందే పొగతాగటం, కాఫీ తాగటం వంటివి చేసి ఉంటే కచ్చితంగా బీపీ ఎంతోకొంత ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కొంత సమయం ఇచ్చి చూడటం మంచిది.
* బీపీ ఏమాత్రం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించినా వైద్యులు ముందుగా జీవనశైలి మార్పులకు సంబంధించిన ఆరోగ్య సూత్రాలను సూచించాలి. ముందే మందులు ఆరంభించాల్సిన అవసరం లేదు. వారికి ఆరోగ్య సూత్రాలు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పి, అవి తప్పనిసరిగా పాటించేలా చూడాలి.
* కొన్నిసార్లు వైద్యుల వద్దకు వచ్చినప్పుడు బీపీ పెరుగుతూ, తర్వాత ఇంటి దగ్గర చూసుకుంటే చాలా తక్కువగా ఉండొచ్చు. ఇలాంటి వాటిని ‘వైట్‌కాలర్ హైపర్‌టెన్షన్’ అంటారు. ఎవరైనా రోగి ఇలా చెబుతుంటే దాన్ని తేలికగా తీసుకుని వదిలెయ్యకూడదు. బీపీలో ఇలా హెచ్చుతగ్గులు, మార్పులు ఎక్కువగా కనబడుతుంటే రోజంతా బీపీని నమోదు చేసే ‘యాంబ్యులేటరీ మానిటరింగ్’ చెయ్యటం ఉపయోగపడుతుంది.
* బీపీ మరీ ఎక్కువ లేకపోతే మొదటిసారే మందులు ఆరంభించాల్సిన అవసరం లేదు. రోగిని మరో రెండు మూడుసార్లు రమ్మని చెప్పి.. బీపీని గమనించొచ్చు. ఎందుకంటే ఒకసారి మందులు ఆరంభించిన తర్వాత వాటిని చాలాకాలం వాడాల్సి ఉంటుంది, వెంటనే మందుల మోతాదు తగ్గించలేకపోవచ్చు కూడా.
* మందులు ఆరంభించిన తర్వాత బీపీ కచ్చితంగా నియంత్రణలో ఉంటోందా? లేదా? చూసుకోవటం అవసరం. ఏదో ఒక స్థాయిలో కొద్దిగా తగ్గింది కదా అని వదిలెయ్యకూడదు. మందులు ఆరంభించిన తర్వాత 130/80కి ఎంత దగ్గరలోకి తీసుకురాగలిగితే అంత మంచిది. మధుమేహం, మూత్రపిండాల జబ్బుల వంటివి ఉంటే బీపీ తప్పనిసరిగా 120/80 కంటే తక్కువే ఉండేలా చూడాలి.
* మందులు ఆరంభించినా ఆరోగ్యసూత్రాలు, జాగ్రత్తలు జీవితాంతం పాటించాల్సిందే. మందులు వేసుకుంటున్నాం కదా అని ఉప్పు ఎక్కువెక్కువ తినెయ్యటం, వ్యాయామం మానెయ్యటం వంటివి చెయ్యకూడదు. అటు మందులు, ఇటు జీవనశైలి మార్పులు- ఈ రెండూ కలిపి చూస్తేనే మనకు సరైన ఫలితాలు ఉంటాయి.
* బీపీని నియంత్రణలోకి తెచ్చేందుకు ఇప్పుడు ఒకే మందును ఎక్కువ మోతాదులో ఇచ్చేకంటే... ఒకటి కంటే ఎక్కువ మందులను ఇప్పుడు తక్కువ మోతాదులో సూచిస్తారు. ఇదే ఉపయోగకరమైన విధానం. ఆ మందులు వాడుతూ ఫలితాలను గమనిస్తుండాలి. ప్రయోజనం కనబడకుంటే వాటినే మోతాదు పెంచుతూ పోయే కంటే- అవసరాన్ని బట్టి కొత్త వాటిని జోడించటం వంటి మార్పుచేర్పులు అవసరం.
* రెండు మూడు రకాల మందులు వాడుతున్నా బీపీ తగ్గని వారికి.. ఎందుకు తగ్గటం లేదన్నది లోతుగా పరిశీలించి చూడాలి. ముఖ్యంగా ఉప్పు తగ్గిస్తున్నారా? ఇతరత్రా మందులేమైనా వాడుతున్నారా? అన్నదీ గమనించాలి. ఎందుకంటే ఆస్థమా బాధితులు, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వంటి బాధలున్నవారు, ఇతరత్రా వ్యాధుల్లో కూడా చాలామంది స్టిరాయిడ్ మందులు వాడుతుంటారు. ఇవి వాడుతున్నప్పుడు బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ముక్కు దిబ్బడకు కొందరు ముక్కులో చుక్కల మందులు వేసుకుంటూ ఉంటారు, వాటిని అలవాటుగా వేసుకుంటున్నా కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొందరు నొప్పులు తగ్గేందుకు నిత్యం కొన్ని మందులు (ఎన్‌ఎస్‌ఏఐడిఎస్) వాడుతుంటారు. ఇవి కూడా బీపీ పెంచుతాయి. కాబట్టి ఏ మందూ కూడా బాగా అవసరం ఉంటే తప్పించి వాడకపోవటం మంచిది. అలాగే ఏవి వాడుతున్నా కూడా వాటి గురించి తప్పనిసరిగా వైద్యులు అడిగి తెలుసుకోవాలి, రోగులూ తప్పనిసరిగా చెప్పాలి. బీపీకి సంబంధించిన మందు కాదు కదా.. అనుకుంటూ చెప్పకుండా ఉండిపోవటం పొరపాటు. వైద్యులు ఇవన్నీ పరిశీలించాలి.
* ఒకవేళ మూణ్నాలుగు మందులు వాడుతున్నా కూడా బీపీ తగ్గకపోతే ఇప్పుడు రేడియోఫ్రీక్వెన్సీ తరంగాలతో చేసే ‘రీనల్ ఆర్ట్రీ డీనెర్వేషన్’ వంటి చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి బీపీ ఎంతకూ తగ్గకుంటే ఇతరత్రా స్పెషలిస్ట్ వైద్యుల వద్దకు పంపించటం మంచిది.
* మందులు వాడుతున్నప్పుడు బీపీ తగ్గితే... వెంటనే మందులు ఆపెయ్యకూడదు. మందుల ప్రభావం వల్లనే బీపీ నియంత్రణలోకి వచ్చిందని గుర్తించాలి. అవసరమైతే అప్పుడు మందుల మోతాదు కొద్దిగా తగ్గించి చూడొచ్చు. అప్పటికీ తక్కువే ఉంటుంటే అప్పుడు క్రమేపీ ఒక మందు ఆపేసి చూడటం వంటివి చెయ్యచ్చు. అంతేగానీ ఒక్కసారిగా మందు ఆపెయ్యకూడదు. ఆపేసిన తర్వాతా బీపీని గమనిస్తుండాలి. ఎందుకంటే మందులు ఆపిన తర్వాత వెంటనే బీపీ పెరిగిపోదు. మళ్లీ నెల తర్వాతో, రెండుమూడు నెలల తర్వాతో పెరగొచ్చు. కాబట్టి అలా పెరుగుతోందేమో గమనిస్తూ... నెలకూ, రెండు, మూడు నెలలకూ బీపీ పరీక్ష చేసి చూసుకుంటూనే ఉండాలి.
నాకు బీపీ ఏంటి అనుకోవద్దు!
* వైద్యుల వద్దకు వచ్చేవారిని గమనిస్తే చాలామంది ‘మా ఇంటావంటా బీపీ లేదు... నాకు రావటమేంటి?’ అన్న ధోరణిలో ఉంటున్నారుగానీ ఇది సరికాదు. ‘మా నాన్నకు లేదు, అమ్మకు లేదు’ నాకెందుకు వస్తుందనే వారూ ఉన్నారు. కానీ బీపీ ఇలా వంశపారంపర్యంగానే వస్తుందనుకోవటం పొరపాటు. రెండోది- ఈ ఆరోగ్య చైతన్యం, బీపీ చూపించుకోవటం వంటివన్నీ ఒకటి రెండు తరాల నుంచే మొదలయ్యాయి. అంతకు ముందు, అంటే మన వంశంలో, తాతల తరంలో వారికి హైబీపీ వంటి రుగ్మతలు ఉన్నా కూడా మనకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి బీపీ ‘మా ఇంటావంటా లేదని’ ధీమాగా ఉండిపోవటం సరికాదు. 25 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికోసారైనా తప్పనిసరిగా వైద్యుల చేత బీపీ చూపించుకోవటం అవసరమని గుర్తించాలి.
* చాలామంది బీపీ ఎక్కువ ఉంటే కోపం, ఆవేశం ఎక్కువుంటాయనీ, బీపీ ఎక్కువున్న వాళ్లు ఎక్కువగా అన్నింటికీ అరుస్తారనీ.. చికాకుపడుతుంటారనీ.. ఇలాంటి రకరకాల నమ్మకాల్లో ఉంటున్నారు. కానీ ఇవేవీ నిజం కాదు. బీపీ ఎంత ఎక్కువ ఎక్కువున్నా కూడా పైకి ఎటువంటి లక్షణాలూ, సంకేతాలూ ఉండకపోవచ్చు. కాబట్టి హైబీపీ ఉందా? అన్నది తెలుసుకోవటానికి ఉన్న ఏకైక మార్గం.. బీపీ కొలిపించుకోవటం ఒక్కటే. మనకు తెలిసినా, తెలియకున్నా... దీర్ఘకాలం హైబీపీ ఉండిపోతే దానివల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.
* ఇవాల్టికీ చాలామంది మన ‘వయసు + 100’ వరకూ బీపీ ఉండొచ్చని నమ్ముతున్నారుగానీ ఇది చాలా ప్రమాదకరమైన అపోహ. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ప్రామాణిక సంస్థలన్నీ కూడా ఏ వయసులోనైనా బీపీ 120/80 ఉండటమే ‘నార్మల్’ అని స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి బీపీకి వయసుతో ప్రమేయం లేదని గుర్తించాలి.
* బీపీ మందులను పూర్తిగా వైద్యుల సిఫార్సు మేరకే వేసుకోవాలి. అంతేగానీ ఎవరో ఎదురింటివారు, పక్కింటివారు వాడుతుంటే వాళ్లకు బాగా కంట్రోల్‌లోకి వచ్చిందని నమ్ముతూ.. మనమూ అవే వేసుకోవటం తప్పు. తరచూ మందులు మార్చటం, ఎవరో చెప్పిన మందులు వాడటం సరికాదు. వైద్యుల సిఫార్సు మేరకే వేసుకోవాలి.
* చాలామంది ఇప్పుడు మందులు వేసుకునే ఆర్థిక స్థోమత తమకు ఉంది కదా అని భావిస్తూ జీవనశైలి మార్పులను నిర్లక్ష్యం చేస్తున్నారు. హాయిగా అన్నీ ఇష్టం వచ్చినట్టు తినటం, మద్యం తాగటం, వ్యాయామం మానెయ్యటం వంటివి చెయ్యటం సరికాదు. ముందు జీవనశైలి మార్పులు, తర్వాత అవసరమైతే మందులతో బీపీని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. జీవనశైలి మార్పులు జీవితాంతం పాటించాలి.
Post a Comment