ఫ్రీ ఆఫీస్‌పై లుక్కేయండి , FREE OFFICE


-------FREE OFFICE ఫ్రీ ఆఫీస్‌పై లుక్కేయండి!;------
ఎప్పుడూ మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌నే వాడతారా? ఒకసారి ఫ్రీ ఆఫీస్‌ 2016ని వాడి చూడండి. అద్భుతమైన ఫీచర్లు, ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌ ఆప్షన్లతో వచ్చిన ఈ ఆఫీస్‌ సూట్‌ మీ ఆఫీస్‌ అవసరాలకు సరిగ్గా నప్పుతుంది. ఆ విశేషాలు ఇవి..
మైక్రోసాఫ్ట్‌ ఆఫీ్‌సలో అద్భుతమైన ఫీచర్లున్నాయని, మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ ఆఫీస్‌ సూట్‌ అని అంటే ఎవ్వరూ కాదనరు. అయితే ఎంఎస్‌ ఆఫీస్‌ మీకు కరెక్ట్‌ కాకపోవచ్చు. మీ ఆఫీస్‌ అవసరాలకు తగిన ఫీచర్లు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయం కోసం చూడక తప్పదు. కొన్నేళ్లుగా మైక్రోసా్‌ఫ్టకు లిబర్‌ ఆఫీస్‌ పోటీనిస్తోంది. ఎప్పటికప్పుడు అదనపు ఫీచర్లను జోడిస్తూ వస్తున్న లిబర్‌ ఆఫీస్‌ కొంతవరకు మైక్రోసా్‌ఫ్టను పోటీగా నిలిచింది. ఉచితంగా లభించడమే కాకుండా ఓపెన్‌సోర్స్‌లోనూ ఇది అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా పోటీలోకి మూడో ఆఫీస్‌ సూట్‌ వచ్చి చేరింది. అదే ఫ్రీఆఫీస్‌ 2016. సాఫ్ట్‌మేకర్‌ ఆఫీస్‌ రూపొందించిన వెర్షన్‌ ఇది. మైక్రోసాఫ్ట్‌ ఆఫీ్‌సతో పోల్చితే ఇందులో అనేక మెరుగైన ఫీచర్లున్నాయి.
టెక్ట్స్‌మేకర్‌
ఏ ఆఫీ్‌సలో చూసినా డాక్యుమెంట్స్‌ను ప్రిపేర్‌ చేయడం, ఎక్సెల్‌ ఫైల్స్‌ క్రియేట్‌ చేయడం, ప్రెజెంటేషన్స్‌ రూపొందించడం.. ఈ పనులే ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు డాక్‌ఫైల్స్‌ ఓపెన్‌ కాకపోవడం, ఓపెన్‌ అయినా ఫాంట్‌ మారిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి సమస్యలు ఆఫీస్‌ 2016తో దూరమవుతాయి. పాత డాక్‌ ఫైల్స్‌, కొత్త డాక్‌ఎక్స్‌ ఫైల్స్‌ ఈ ఆఫీస్‌ సూట్‌లో సులభంగా ఓపెన్‌ అవుతాయి. ఏ వెర్షన్‌ టెక్ట్స్‌ మేకర్‌ల మధ్యనైనా డాక్యుమెంట్లను మార్పిడి చేసుకోవచ్చు. పాస్‌వర్డ్‌ ప్రొటెక్ట్‌ ఫైల్స్‌ను సైతం ఓపెన్‌ చేసుకోవచ్చు. ఓపెన్‌ డాక్యుమెంట్‌ ఫైల్స్‌ ఓపెన్‌ ఆఫీ్‌సతోనూ, లిబర్‌ ఆఫీ్‌సతోనూ కంపాటిబుల్‌గా ఉంటాయి. డాక్యుమెంట్లను ఆర్‌టీఎఫ్‌, హెచ్‌టీఎంఎల్‌, పాకెట్‌వర్డ్‌, ఆస్కీ, యూనికోడ్‌లలో సేవ్‌ చేసుకోవచ్చు. టెక్స్ట్‌ ఫైల్స్‌ను సులభంగా ఇంపోర్టింగ్‌, ఎక్స్‌పోర్టింగ్‌ చేయవచ్చు. టెక్ట్స్‌మేకర్‌లోనే పీడీఎఫ్‌ ఫైల్స్‌ను క్రియేట్‌ చేయవచ్చు. బిజినెస్‌ డాక్యుమెంట్లను సులభంగా ప్రిపేర్‌ చేసుకోవచ్చు. సైంటిఫిక్‌ ఎస్సేల కోసం ఫుట్‌నోట్స్‌, ఎండ్‌నోట్స్‌, క్రాస్‌ రెఫరెన్స్‌, ఇమేజ్‌ క్యాప్షన్‌, ఇండెక్స్‌లు, టేబుల్‌ కంటెంట్‌లు, టేబుల్‌ ఆఫ్‌ ఫిగర్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఎడిటింగ్‌, ఫార్మాటింగ్‌
డాక్యుమెంట్లను క్రియేట్‌ చేయడమే కాకుండా ఎడిటింగ్‌, ఫార్మాటింగ్‌ వంటి పనులు ఎక్కువ చేయాల్సి వస్తుంది. డాక్యుమెంట్‌ టైపింగ్‌ సులభంగా చేయడానికి స్మార్ట్‌టెక్ట్స్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ‘ఏఎ్‌సఏపీ’ అని టైప్‌ చేయగానే యాస్‌ సూన్‌ యాస్‌ పాసిబుల్‌ అని కనిపిస్తుంది. డేట్‌, టైమ్‌, పేజ్‌నంబర్‌ వంటి ఫీల్డ్స్‌ను సులభంగా ఇన్‌సెర్ట్‌ చేయవచ్చు. బార్డర్స్‌, షేడింగ్‌, డ్రాప్‌క్యాప్స్‌, పారగ్రాఫ్‌ కంట్రోల్‌, క్యారెక్టర్‌ స్టయిల్‌ వంటి ఆప్షన్లున్నాయి. ఫార్మాటింగ్‌ మార్పులను రియల్‌ టైమ్‌ ప్రివ్యూలో చూడొచ్చు. డాక్యుమెంట్ల మధ్య స్టయిల్స్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడానికి స్టయిల్‌షీట్‌ మేనేజర్‌ ఉపకరిస్తుంది. లైన్స్‌, పారాగ్రా్‌ఫ్సకు ఆటోమెటిక్‌ నంబరింగ్‌ ఇచ్చుకోవచ్చు.
గ్రాఫిక్స్‌, డ్రాయింగ్స్‌
డాక్యుమెంట్స్‌లో గ్రాఫిక్స్‌, డ్రాయింగ్స్‌ వంటివి చేయడానికి ఫ్రీ ఆఫీస్‌ సూట్‌ ఉపయోగపడుతుంది. ఆటోషేప్స్‌ సహాయంతో నేరుగా డాక్యుమెంట్‌లోనే డ్రాయింగ్‌, డిజైన్‌ చేసుకోవచ్చు. మీరు చేసే ఏ డాక్యుమెంటైనా మైక్రోసాఫ్ట్‌ పవర్‌పాయింట్‌తో కంపాటిబుల్‌ అవుతుంది. డాక్యుమెంట్‌లో నేరుగా ఇమేజ్‌లను క్రాప్‌ చేసుకోవచ్చు. ప్రెజెంటేషన్‌లో డైరెక్ట్‌గా బ్రైట్‌నెస్‌, కాంట్రా్‌స్టను మార్చుకోవచ్చు. ఫొటోలైన్స్‌, ఆబ్జెక్స్‌ మధ్య కనెక్టర్‌ లైన్స్‌, ఫ్లో చార్ట్స్‌ కోసం సింబల్స్‌ లైబ్రరీ వంటి ఆప్షన్లు అదనం. టైప్‌ ఎఫెక్ట్స్‌ కావాలంటే టెక్ట్స్‌ ఆర్ట్‌ ఫీచర్‌ని వాడుకోవచ్చు. బార్‌చార్ట్స్‌, పై చార్ట్స్‌, హిస్టోగ్రామ్స్‌ వంటి 80 రకాల చార్ట్స్‌ను ఇన్‌సెర్ట్‌ చేసుకోవచ్చు.
మల్టీమీడియా
డాక్యుమెంట్లకు గ్రాఫిక్స్‌ జోడించి స్లైడ్స్‌గా మార్చుకోవచ్చు. మూవీస్‌, సౌండ్‌ఫైల్స్‌ను సులభంగా ఇన్‌సెర్ట్‌ చేయవచ్చు. ఇమేజ్‌ కలెక్షన్స్‌ని సైతం ఇన్‌సెర్ట్‌ చేసుకోవచ్చు. స్లైడ్స్‌లో సౌండ్స్‌ని ప్లే చేసే వీలుంటుంది. కొన్ని వందల రకాల టెక్ట్స్‌ యానిమేషన్స్‌ అందుబాటులో ఉంటాయి. ప్రెజెంటేషన్‌ మరింత అద్భుతంగా ఉండటం కోసం రెడీమేడ్‌ యానిమేషన్‌ స్కీమ్స్‌ని వాడుకోవచ్చు.
ఫ్లెక్సిబుల్‌ ప్రెజెంటేషన్‌
స్మాల్‌ ఎఫర్ట్‌తో బిగ్‌ ఎఫెక్ట్‌ పొందడానికి ప్రెజెంటేషన్స్‌ బాగా ఉపయోగపడతాయి. గ్రాఫిక్స్‌, టేబుల్స్‌, చార్ట్స్‌తో కూడిన స్లైడ్స్‌కి మ్యూజిక్‌ని జత చేయవచ్చు. అవసరమైతే మీ కామెంట్స్‌ని జోడించుకోవచ్చు. షార్ట్‌ వీడియో వేల పదాల కన్నా శక్తివంతమైనది. స్లైడ్‌లో వీడియోని కూడా యాడ్‌ చేసుకోవచ్చు. స్పీకర్‌ లేకుండా యూజర్‌ కంట్రోల్డ్‌, ఆటోమెటిక్‌ ప్రెజెంటేషన్స్‌ను ఇచ్చే వీలుంటుంది. స్లైడ్‌ షోని వర్చువల్‌ పెన్‌, హైలైటర్‌ సహాయంతో ప్రెజెంట్‌ చేయవచ్చు. ఫుల్‌ స్ర్కీన్‌ వ్యూ ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు సొంత స్లైడ్స్‌ డిజైన్‌ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆఫీస్‌ సూట్‌లో ఉన్న అట్రాక్టివ్‌ డిజైన్‌ టెంప్లేట్స్‌ను వాడుకోవచ్చు. రకరకాల కలర్‌ స్కీమ్స్‌, స్లైడ్‌ లేఅవుట్స్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఎక్స్‌ట్రాస్‌
ఫుల్లీ యూనికోడ్‌ ఎనేబుల్‌ ఆప్షన్‌ ఉంటుంది. జూమ్‌, స్ర్కోల్‌ వంటివి సులువుగా చేయవచ్చు. హైరిజల్యూషన్‌ 4కె స్ర్కీన్స్‌ను సపోర్టు చేస్తుంది. ఇరవై భాషల్లోని పదాలను స్పెల్‌ చెక్‌ చేసుకోవచ్చు. పది భాషల్లో పర్యాయపదాలను వెతుక్కోవచ్చు. యూఎస్‌బీ ఫ్లాష్‌ డ్రైవ్‌ సహాయంతో ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. అంటే ఇన్‌స్టలేషన్‌ చాలా సులువు.
ప్లాన్‌మేకర్‌
ఒక వర్క్‌షీట్‌లో పదిలక్షల వరుసల (రోస్‌) వరకు అనుమతి ఉంటుంది. ఈ డాటాను సులువుగా వాడుకోవడానికి పైవట్‌ టేబుల్స్‌, డాటా కన్సాలిడేషన్‌, సినారియోస్‌, డాటా గ్రూపింగ్‌, అటోఫిల్టర్‌, స్పెషల్‌ ఫిల్టర్‌ వంటి పీచర్లు ఉపయోగపడతాయి. ఎర్రర్స్‌ను గుర్తించడానికి సింటాక్స్‌ హైలైటింగ్‌ ఉపకరిస్తుంది. లే అవుట్‌ బాగా కనిపించడానికి అటోఫార్మాట్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఒక క్లిక్‌తో ఎలిగెంట్‌ లేఅవుట్‌ను పొందవచ్చు. ఇండివిడ్యువల్‌గానూ వర్క్‌షీట్స్‌ను ఫార్మాట్‌ చేసుకోవచ్చు. ముఖ్యమైన వాటిని క్రియేటివ్‌గా హైలెట్‌ అయ్యేలా రూపొందించుకోవచ్చు. ఎక్సెల్‌లో ఉన్న కండిషనల్‌ ఫార్మాటింగ్‌ మాదిరిగా ప్లాన్‌మేకర్‌ ఆటోమెటిక్‌గా డాటాలో ఉన్న హయ్యెస్ట్‌, లోయెస్ట్‌ వాల్యూ్‌సని హైలెట్‌ చేసి చూపిస్తుంది. చార్ట్స్‌ని ప్రెజెంటేషన్‌ రూపంలో తయారుచేసుకోవచ్చు. 2డి లేక 3డిలో 80 రకాల చార్ట్‌లను ఎంచుకోవచ్చు.
ప్రెజెంటేషన్స్‌ని స్లైడ్స్‌ రూపంలో తయారుచేసుకోవచ్చు. గ్రాఫిక్స్‌, టేబుల్స్‌, చార్ట్స్‌ను స్లైడ్స్‌ రూపంలో చేసి ప్రెజెంటేషన్‌ ఇవ్వొచ్చు. వాటికి మ్యూజిక్‌ను లేదా మీ కామెంట్స్‌ను జత చేసుకోవచ్చు. స్లైడ్స్‌ని మాన్యువల్‌గా లేక సమయం ఆధారంగా నియంత్రించుకోవచ్చు. ప్రెజెంటేషన్‌ సమయంలో స్లైడ్స్‌పై వర్చువల్‌ పెన్‌ సహాయంతో రాసి ముఖ్యమైన అంశాలను హైలెట్‌ చేయవచ్చు.

Post a Comment

أحدث أقدم