వర్షాకాలంలో ఇవి మాత్రం తినకండి, In Rainy Season Don't Eat These


వర్షాకాలంలో ఇవి మాత్రం తినకండి:---------
వర్షాకాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు మరి. ఆ ఆహార పదార్థాలు ఏమిటంటే...
పళ్లరసాలు, లస్సీ, పెరుగు, చెరకు రసాలు అస్సలంటే అస్సలు తాగొద్దు.
బంగాళా దుంపలు, మొలకెత్తిన గింజలు, కందులు, గోరుచిక్కుడు వంటి అజీర్ణానికి కారణమయ్యే పదార్థాలు తినకుండా ఉంటే బెటర్‌.
వీధుల్లో బండ్ల మీద లభించే చాట్‌, సమోసా, పానీపూరీలకి బిగ్‌ నో.
సమోసా, పకోడీ వంటి కొవ్వు అధికంగా ఉన్నవి, వేపుళ్లు, బర్గర్లు, అధికంగా ఉప్పు ఉండే పచ్చళ్లు, చట్నీలు తినడం మానేయాలి.
ఆవ, నువ్వుల నూనెలకి బదులు మొక్కజొన్న, ఆలివ్‌ నూనెలు వాడితే తిన్నది త్వరగా జీర్ణమవుతుంది.
ఈ సీజన్‌లో పచ్చి ఆహారం తినడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే పచ్చి పదార్థాల్లో ఉండే ఎంజైమ్‌లను జీర్ణవ్యవస్థ సరిగా జీర్ణం చేసుకోలేదు. అంతేకాకుండా పచ్చి వాటి మీద బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి.
రెస్టారెంట్లు, పార్టీలు, ఫంక్షన్లలో ఆకుకూరల వంటకాలు, సలాడ్‌లు తినకూడదు. ఎందుకంటే ఇటువంటి ప్రదేశాల్లో సూక్ష్మజీవులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది.
పుచ్చకాయ, కీర వంటి నీరు కలిగిన పళ్లను బండ్ల మీద ముక్కలు కోసి అమ్ముతుంటే తినొద్దు.
పచ్చి గుడ్డు, సీ ఫుడ్‌లను వర్షాకాలంలో తినకపోవడమే బెటర్‌. ఎందుకంటే ఈ సీజన్‌లో కొన్ని రకాల చేపలు, రొయ్యలకి బ్రీడింగ్‌ సమయం. దానివల్ల పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ చేపలు కొనాల్సి వస్తే చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి.

Post a Comment

أحدث أقدم