ఒళ్లు కాలుతోంది... మేలుకోండి!
Smoking Is Injurious to Health
కాలుతున్నది చేతిలోని సిగరెట్ కాదు.. దాన్ని పట్టుకున్న వేలు, ఒళ్లు అని తెలుసు. కానీ ఎంతో మంది నేటికీ.. తమ చేతులతోనే.. తమ ఒంటికి తాము నిప్పు పెట్టు కుంటున్నారు! ఆ పొగలోనే కాలిపోతున్నారు.
పొగ ఒళ్లంతా కబళిస్తుంది. ఇల్లంతా ఆవరిస్తుంది. తాగే వాడినే కాదు.. ఇంటిల్లిపాదినీ రోగాల పాలు చేస్తుంది. అందుకే ఒకళ్లు పొగ మానేస్తే వాళ్లతో పాటు చుట్టూ ఉన్న బోలడంత మంది బాగుపడతారు.
ఇంత తెలిసీ.. మరి మనం ఈ నిప్పు ఆర్పలేమా? కచ్చితంగా దీనిపై నీళ్లు చల్లగలం. అందుకు అవగాహన పెంచుకోవాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఈ రెండూ చేస్తే చాలు.. ప్రపంచం పొగాకు రహితమవటం తథ్యమని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ!
కాలిస్తేనే తప్పనుకోవద్దు..
చుట్ట, బీడీ, హుక్కా, సిగరెట్టు.. ఇలా పొగ తాగటమే కాదు.. పాన్, జర్దా, ఖైనీ, కిళ్లీ, ముక్కుపొడుం.. ఇలా పొగాకును ఏ రూపంలో తీసుకున్నా కూడా ఆరోగ్యంపై దుష్ప్రభావం తప్పదు. ఎందుకంటే పొగాకులోనే ప్రమాదకర విషతుల్యాలెన్నో ఉంటాయి. వాటిని ఏ రూపంలో తీసుకున్నా అంతిమ ప్రభావం ఒకటే.

పొగ పీల్చగానే.. నికొటిన్ వూపిరితిత్తుల నుంచి చాలా వేగంగా రక్తంలో కలిసి, 10-16 సెకన్లలోనే మెదడును చేరుతుంది. వెంటనే కొత్త ఉత్సాహం ఆవరించినట్లుంటుంది. అయితే ఈ నికొటిన్ ఒంట్లో ఎక్కువసేపుండదు. దీంతో మళ్లీ నికొటిన్ కోసం తహతహ, సిగరెట్ తాగాలన్న కాంక్ష బయల్దేరతాయి. వ్యసనానికి ఇదే మూలం!
పొగలో, పొగాకులో ఎంతలేదన్నా 4000 రసాయనాలుంటాయి. వీటిలో చాలా భాగం విషతుల్య పదార్థాలే. ఇవి మన శరీరంలోని కణాలను, వాటి పనితీరును దెబ్బతీస్తాయి. పొగాకులో ఉండే దాదాపు 60 రకాల రసాయనాలు క్యాన్సర్లను తెచ్చిపెడతాయి.
నికొటిన్: దీనివల్లే మళ్లీ మళ్లీ పొగ తాగాలనిపిస్తూ, అదో వ్యసనంగా మారుతుంది. ఇది మెదడు నుంచి గుండె వరకూ సర్వాంగాలనూ దెబ్బతీస్తుంది. నికోటిన్ వల్ల శరీరంలోనూ, మానసిక ప్రవర్తనలోనూ ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అందుకే దీన్ని సాధారణంగా క్రిమికీటకాలను చంపేందుకు పురుగు మందుల్లో కూడా వాడుతుంటారు.
కార్బన్ మోనాక్సైడ్: ఇదో విషవాయువు. పొగాకు మండించినప్పుడు వెలువడుతుంది. దీనికి ఎలాంటి రంగూ, రుచీ ఉండదు. దీంతో శరీరం దీన్ని గుర్తించలేక ఆక్సిజన్ అవసరమైన ప్రతిచోటా దీన్ని నింపేసుకుంటుంది. ఇది గుండె పనితీరు మందగించేలా చేస్తుంది.
తారు: వాహనాల పొగ గొట్టాల్లో ఉండే జిడ్డులాంటిదే ఈ తారు. దీన్నిండా క్యాన్సర్ కారకాలే ఉంటాయి. పొగతాగే వారి గాలి గొట్టాల్లో కూడా లోపల ఈ తారు జిడ్డులా పట్టేస్తుంది. లోపలికి పీల్చిన పొగ బయటకు వదిలినప్పుడు పొగలోని 70% తారు లోపల గాలిగొట్టాలకు పట్టుకుపోతుంది. ఇది లోపలి గోడలకు పేరుకుపోతుంది. దీంతో శ్వాస కష్టంగా తయారవుతుంది. వూపిరితిత్తులు పాడవటమే కాదు, క్యాన్సర్లూ మొదలవుతాయి.
ఇంకా... పొగలో..: ఇంట్లో నేలశుభ్రం చేసేందుకు వాడే క్లీనర్లలో ఉండే అమ్మోనియా.. చెద పురుగులను చంపేందుకు వాడే ద్రావణంలో ఉండే ఆర్సెనిక్.. మనుషులను చంపేందుకు గ్యాస్ ఛాంబర్లలో వాడే హైడ్రోజెన్ సైనైడ్.. పురుగులు చేరకుండా కలరా వుండల్లో వాడే నాఫ్తలీన్.. ఇలాంటివెన్నో పొగలో ఉంటాయి. తెలిసితెలిసీ మరి మనం వీటిని లోపలికి పీలుస్తున్నామన్న విషయం మీకు తెలుసా?
గర్భిణులు బహుపరాక్!
గర్భిణులు పొగ తాగితే.. ఆ పొగ ప్రభావం నేరుగా కడుపులోని పిండంపైనే పడుతుంది. పొగ తాగే గర్భిణులకు- గర్భస్రావాలు కావటం, మృతశిశువులు పుట్టటం, నెలలు నిండక ముందే కాన్పు రావటం, కాన్పు తర్వాత కూడా ఉన్నట్టుండి పసిబిడ్డలు హఠాన్మరణం పాలవ్వటం వంటివన్నీ జరగొచ్చు. పొగలో ఉండే విషతుల్య రసాయనాలన్నీ రక్తం, మాయ ద్వారా పిండాన్నీ చేరతాయి. ఇవి పిండం గుండె, వూపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి గర్భిణులు అస్సలు పొగ జోలికే పోకూడదు. పొగతాగే వాతావరణంలో కూడా ఉండకూడదు.

పక్కవాళ్లకూ పొగ!
సిగరెట్ కాలుతున్నప్పుడు చుట్టుపక్కల ఆవరించే పొగలో కూడా ఎన్నో విషతుల్య రసాయనాలుంటాయి. వీటిని పీల్చే వారికి కూడా ఆరోగ్య సమస్యలు తప్పవు. దీన్నే ‘సెకండ్ హ్యాండ్ స్మోక్’ అంటారు. నేరుగా పొగతాగే వారికి ఎంతటి వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందో ఈ పొగ పీల్చేవాళ్లకూ అంతే ముప్పు ఉంటుంది. ఈ ప్రభావం పిల్లలపై మరీ ఎక్కువ. కిటికీల వంటివి తీసి, పొగ తాగినా కూడా ఇంటి వాతావరణం నుంచి ఆ ప్రభావం తొలగిపోదు. కాబట్టి పొగ మానెయ్యటం ఒక్కటే ఉత్తమం.

పొగ గుప్పుమంటూ కేవలం మన వూపిరితిత్తుల్లోకి మాత్రమే వెళుతుందనీ, దీంతో మహా అయితే దగ్గు వస్తుందనీ.. అంతకు మించి పెద్ద సమస్యలేం ఉండవని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. పొగ నేరుగా వెళ్లేది వూపిరితిత్తుల్లోకే అయినా.. అక్కడి నుంచి దాన్లోని వేలాది విషతుల్యాలు రక్తంలో కలిసి, శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్నీ చేరి, దాన్ని భ్రష్టు పట్టిస్తాయి.
రక్తం.. గుండె.. మెదడు
పొగ వల్ల రక్తం, రక్తప్రసారం తీవ్రంగా ప్రభావితమవుతాయి. పొగను పీల్చినప్పుడు.. దానిలో ఉండే వేలాది విషతుల్యాలన్నీ వూపిరితిత్తుల ద్వారా రక్తంలో కలిసి, రక్తం చిక్కబడేలా చేస్తాయి. దీనివల్ల రక్తం గడ్డకట్టి తీవ్ర సమస్యలు తలెత్తే ముప్పు పెరుగుతుంది. రెండోది- పొగ తాగే వారికి రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం పెరుగుతాయి. దీంతో గుండె ఎప్పటికంటే బలంగా పని చెయ్యాల్సి వస్తుంది, దానిపై భారం పెరుగుతుంది. మూడోది- పొగతాగే వారిలో రక్తనాళాలు సన్నబడిపోతాయి. దీంతో శరీరంలో చాలా అవయవాలకు రక్తసరఫరా తగ్గిపోతుంది. గుండెలోనూ, మెదడులోనూ రక్తనాళాల్లో అవరోధాలు తలెత్తి గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు ముంచుకొస్తాయి. కాళ్లకు కూడా రక్తసరఫరా తగ్గి పాదాల మీద పుండ్లు మానకపోవటం వంటి సమస్యలు బయల్దేరతాయి. వీటివల్ల కొన్నిసార్లు వేళ్లు, కాళ్లు తొలగించాల్సిన అగత్యం కూడా ఏర్పడుతుంది.
అల్సర్లు
మన అన్నవాహిక గొట్టం చివర గట్టి కండర కవాటాలుంటాయి. ఇవి జీర్ణాశయంలో ఉండే ఆమ్లం, జీర్ణరసాల వంటివన్నీ పైకి ఎగదన్నుకు రాకుండా గట్టిగా అడ్డుపడుతుంటాయి. అయితే పొగ వల్ల- బిగుతుగా ఉండాల్సిన ఈ కండర కవాటాలు వదులుగా తయారై.. పొట్టలోని ఆమ్లాలు పైకి ఎగదన్నుకొచ్చి గుండెల్లో మంట, అన్నవాహికలో పుండ్ల వంటి బాధలు పెరుగుతాయి.

చర్మం
పొగ వల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్ అందక.. వయసు మీరినట్లుగా, 10-20 ఏళ్లు పెద్దగా కనబడటం మొదలవుతుంది. ముసలి ఛాయలు, ముఖ్యంగా కంటి చుట్టూరా, ముఖం మీద ముడతలు త్వరగా వచ్చేస్తాయి. చెంపలు పచ్చబారినట్లు, బుగ్గలు జారిపోయి లోపలికి పీక్కుపోయినట్లుగా కూడా కనబడతాయి.

ఎముకలు
పొగలో ఉండే రసాయనాల వల్ల ఎముక క్షయం ఆరంభమవుతుంది. ఎముకలు బోలుగా, పెళుసుగా కూడా తయారవుతాయి. అందుకే పొగ తాగే వారికి ఎముకలు, ముఖ్యంగా తుంటి ఎముకలు విరిగే ముప్పు చాలా ఎక్కువ. వీరిలో విరిగిన ఎముకలు అతుక్కోవటానికి కూడా చాలా సమయం పడుతుంది. తగినంత ఆక్సిజన్ సరఫరా లేక కండరాలు కూడా బలహీనపడతాయి. అందుకే పొగతాగే వారికి కండరాల నొప్పులు, బాధలు అధికం.

నోటి అవస్థలు
పొగతాగే వారికి నోటి దుర్వాసన, నోటిలో పుండ్లు, దంతాలు పుచ్చిపోవటం, చిగుళ్ల వ్యాధులు, దంతాల మీద పచ్చటి మచ్చల వంటివన్నీ బయల్దేరతాయి. పొగతాగే వారికి దంతాలు త్వరగా వూడిపోతుంటాయి. నోటి క్యాన్సర్లలో 93% వరకూ పొగతాగే వారిలోనే కనబడతాయి.

వినికిడి, చూపు లోపం
పొగ వల్ల చెవిలోని అత్యంత కీలకమైన కర్ణావృత్తం(కాక్లియా)కు కూడా ఆక్సిజన్ సరఫరా తగ్గి, దాని పనితీరు శాశ్వతంగా తగ్గిపోవచ్చు. అలాగే పొగవల్ల కంటిలోని సహజకటకం త్వరగా గట్టిబడి, చిన్నవయసులోనే శుక్లాలు ఏర్పడతాయి. రాత్రిచూపూ మందగించొచ్చు.

దుర్బలత్వం
పొగలోని విషతుల్యాల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీంతో చీటికీమాటికీ జబ్బుల బారినపడుతుంటారు. పుండ్లు మానటం వంటి సహజ ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. పుండ్లు పడితే ఒక పట్టాన మానవు. కణజాలం కుళ్లిపోయి (గ్యాంగ్రీన్) అవయవాలు తొలగించాల్సిన అవసరం కూడా పెరుగుతుంటుంది.

సంతాన రాహిత్యం
పొగ వల్ల సున్నిత రక్తనాళాలు దెబ్బతిని అంగానికి రక్తసరఫరా క్షీణించి పురుషుల్లో అంగస్తంభన సమస్యలు పెరుగుతాయి. శుక్రకణాల సంఖ్య తగ్గి సంతాన సమస్యలూ ఎదురవ్వచ్చు. ఇక స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు తగ్గి, సంతాన రాహిత్యం, ముందుగానే మెనోపాజ్ దశలోకి వెళ్లటం వంటి ఇబ్బందులూ వెంటాడతాయి.

వూపిరితిత్తులు
పొగతాగటం వల్ల నేరుగా, తొలిగా దెబ్బతినేది వూపిరితిత్తులే! గాలి గొట్టాలు, శ్వాసనాళాల్లోని లోపలి వైపు మృదువైన పొరలు పొగ వల్ల వాచిపోతాయి. దీనివల్ల ఛాతీ పట్టేసినట్టుగా, బిగువుగా అనిపిస్తుంది. బలంగా, వేగంగా గాలి తీసుకోవాల్సి వస్తుంది. క్రమేపీ పిల్లికూతల వంటివి మొదలవుతాయి. ఈ వాపు ఇలాగే కొనసాగుతూ వూపిరితిత్తుల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. తరచుగా జలుబు, దగ్గు, ఉబ్బసం, వూపిరి అందకపోవటం వంటివి మొదలవుతాయి. శ్వాసనాళాల్లో ‘సీలియా’ అని చిన్నచిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలుంటాయి. ఇవి నిరంతరం కదులుతూ, తెమడ, దుమ్మూధూళి వంటివన్నీ లోపలి నుంచి బయటకు వచ్చేసేలా దోహదం చేస్తుంటాయి. పొగ ఈ వెంట్రుకలను దెబ్బతీస్తుంది. దీంతో తరచూ వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వేధిస్తాయి. పొగ క్రమేపీ వూపిరితిత్తుల్లోని చిన్నచిన్న గాలిగదులను పాడు చేసేస్తుంది. దీంతో ఆక్సిజన్-కార్బన్‌డైఆక్సైడ్ వాయు మార్పిడి సరిగా జరగక, శ్వాస కష్టమై ‘ఎంఫసీమా’, ‘సీవోపీడీ’ వంటి తీవ్ర శ్వాస సమస్యలు చుట్టుముడతాయి. ఇవి పూర్తిగా నయమయ్యేవీ కాదు.

క్యాన్సర్లు
పొగతాగే వారికి ఆపాదమస్తకం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరంలోని ప్రతి జీవకణంలోనూ డీఎన్‌ఏ ఉంటుంది. కణాల ప్రతి చర్యనూ ఇదే నియంత్రిస్తుంటుంది. పొగ ఈ డీఎన్‌ఏనూ, దీనిలోని సమాచారాన్నీ ధ్వంసం చేసేస్తుంది. డీఎన్‌ఏ దెబ్బతింటే సరైన మార్గదర్శనం లేక, శరీర కణాలు అస్తవ్యస్తంగా ప్రవర్తించటం, విపరీతంగా విభజన చెందటం ఆరంభిస్తాయి. కణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ.. కాన్సర్ కణాలుగా, క్రమేపీ కణుతులుగా పెరగటం మొదలుపెడతాయి. మన శరీరం డీఎన్‌ఏను మరమ్మతు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటుందిగానీ నిరంతరం దాడి చేస్తుండే పొగ.. దాన్ని కోలుకోనివ్వదు. అందుకే పొగతాగే వారికి ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం క్యాన్సర్ మరణాల్లో మూడోవంతు పొగ, పొగాకు కారణంగా సంభవిస్తున్నవే. పొగతాగే వారికి.. నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, జీర్ణాశయం, వూపిరితిత్తులు, మూత్రాశయం, మూత్రపిండాలు, క్లోమం, పెద్దపేగు.. ఇవన్నీ క్యాన్సర్ బారిన పడొచ్చు. రక్త క్యాన్సర్లు, స్త్రీలలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, పురుషుల్లో వృషణాల క్యాన్సర్ వంటివీ ముంచుకురావచ్చు.

సంకల్పం ఉంటే చాలు
ఎవరైనా పొగలో ఉండే నికోటిన్ వల్ల దానికి బానిసయ్యే మాట నిజమే అయినా.. సరైన దృక్పథంతో దీన్నుంచి బయటపడటం కష్టమేం కాదు. దీనికి ఎన్నో మార్గాలున్నాయి. మందులున్నాయి. మానాలనుకునే వారికి కుటుంబం, స్నేహితులు, ముఖ్యంగా వైద్యులు ఎన్నోరకాలుగా సహాయం చెయ్యగలరు. కాకపోతే ముందుగా ఎలాగైనా మానాలని దృఢమైన సంకల్పం తీసుకోవటం మాత్రం అవసరం. దీనికోసం ఒక కచ్చితమైన తేదీ నిర్ణయించుకోవటం, దానికి మానసికంగా సంసిద్ధం కావటం తప్పనిసరి. మానెయ్యగానే నిద్రపట్టకపోవటం, ఏకాగ్రత కుదరకపోవటం, చికాకుగా అనిపించటం వంటి మానసిక ఇబ్బందులు తలెత్తొచ్చు. వీటి గురించి వైద్యులు ముందే అవగాహన కల్పిస్తారు కాబట్టి అధిగమించటానికి ప్రయత్నించొచ్చు. అవసరాన్ని బట్టి వైద్యులు నికొటిన్ ప్యాచ్‌లు, చ్యూయింగ్ గమ్‌ల వంటివీ ఇచ్చి, సహకరిస్తారు. అనుకున్న మొదటిసారే మానెయ్యలేకపోవచ్చు. కానీ మళ్లీమళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉంటే మానెయ్యటం కచ్చితంగా సాధ్యపడుతుంది. పొగ మానెయ్యగానే డబ్బు ఆదా అవుతుంది. రుచి మొగ్గలు మెరుగ్గా పని చెయ్యటం ఆరంభించి.. మళ్లీ కొత్త జీవితం మొదలైనట్లనిపిస్తుంది. ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి. వీటన్నింటి నుంచీ తిరిగి పునరుత్తేజం పొందుతూ.. సంకల్పాన్ని మరింత దృఢతరం చేసుకోవాలి. మళ్లీ ఎప్పుడైనా తాగాలనిపిస్తే ‘ఈ ఒక్కటీ తాగి ఆపేద్దామని’ మాత్రం అనుకోవద్దు. వెంటనే దృష్టి మరల్చుకోవటానికి ప్రయత్నించటం, ఎవరితోనైనా మాట కలపటం, చిన్నగా వాహ్యాళికి వెళ్లిరావటం, ఏదో పనిలో తలదూర్చటం, ఏదైనా ఒక గ్లాసు జ్యూసు తాగటం, ఆ వాతావరణం నుంచి దూరంగా వెళ్లిపోవటం.. ఇలాంటి చిన్నచిన్న చిట్కాలతో ఆ తహతహను తప్పించుకోవచ్చు. సంకల్పం స్థిరంగా ఉంటే పొగను.. తేలికగా.. దూరంగా... వూదిపారెయ్యొచ్చు!

ఫలితం.. తక్షణం!
పొగ తాగటం మానేసిన మరుక్షణం నుంచే దాని సత్ఫలితాలు, ప్రయోజనాలు కనబడటం మొదలవుతుంది. మానేసిన 20 నిమిషాల్లో.. గుండెకొట్టుకునే వేగం సాధారణ స్థాయికి చేరుకుంటుంది. 8 గంటల తర్వాత రక్తంలో నికొటిన్, కార్బన్ మోనాక్సైడ్ స్థాయులు సగానికిపైగా తగ్గిపోతాయి. ఆక్సిజన్ స్థాయులు సాధారణ స్థాయికి వస్తాయి. 48 గంటల తర్వాత ఒంట్లో నికోటిన్ అనేదే ఉండదు. రుచి, వాసన, సామర్థ్యం మెరుగుపడతాయి. 72 గంటల తర్వాత శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. శ్వాస నాళాలు విప్పారటం మొదలవుతుంది. ఒంట్లో శక్తి పెరిగిన భావన కలుగుతుంది.

إرسال تعليق