చుండ్రు సమస్యకు విరుగుడు, Dandruff, జుట్టు, ఆరోగ్యం, సమస్య, Hair, Health, The problem,


+++++++చుండ్రు సమస్యకు విరుగుడు+++++++++
జుట్టు మృదువుగా, ఆకర్షణీయంగా కనిపించడం ఎంత ముఖ్యమో ఆరోగ్యంగా ఉంచడమూ అంతే ముఖ్యం. తల జిడ్డుతో పాటు చుండ్రు సమస్య కూడా చాలా మందిని బాధిస్తుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా.... వేప నూనె, ఆలివ్ ఆయిల్ సమపాళ్లలో కలిపి వేడి చేయాలి. గోరువెచ్చని నూనె తలకు పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.చిన్న అల్లం ముక్క తీసుకొన్ని సన్నగా తరగాలి. ఈ ముక్కలను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత కుదుళ్లకు నూనె పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చుండ్రు తగ్గిపోతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్‌లో అరటిపండు గుజ్జును బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి వెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. ఆరెంజ్ తొక్కను ముద్దగా నూరి తలకు పట్టించాలి. అరగంట తర్వాత వెచ్చని నీళ్లతో కడిగేయాలి. కప్పు నీళ్లలో 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్‌ని చుట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత యాంటీ-డాండ్రఫ్ షాంపూతో తలంటుకోవాలి.
కలబంద గుజ్జును మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. కలబంద చుండ్రును నివారించడమే కాకుండా మాడుపై ఉన్న చర్మ సమస్యలనూ నివారిస్తుంది. వెంట్రుకలకు మృదుత్వాన్ని ఇస్తుంది.రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ జ్యూస్ అంతే పరిమాణంలో నీళ్లు తీసుకొని తలకు పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పోషకాహారం తినడం, దుమ్ము, ధూళి నుంచి కాపాడుకోవడమే కాకుండా పరిశుభ్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే చుండ్రు సమస్య బాధించదు.
టాగ్లు: జుట్టు, ఆరోగ్యం, సమస్య, Hair, Health, The problem

Post a Comment

أحدث أقدم